News22nd Mar 09:14 AMSunil Byrisetty1 min read

అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్

ఏపీలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు.. వెరసి 948 పోస్టులు భర్

అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు.. వెరసి 948 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ పోస్టుల ఎంపికకు రాతపరీక్ష ఉంటుందని, అర్హత ఉన్నవాళ్లను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలో 139 కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు.
Anganwadi Posts
Recruitment
Andhra pradesh
శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
Scroll for the next article