Education22nd Mar 04:58 PMSunil Byrisetty1 min read

పది పరీక్షల కోసం ఒంటిపూట బడుల్లో..

ఎండలు మండుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే పదో తరగతి పరీక్షల కారణంగా ఏపీలో ప్రభుత్వం ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేసింది. పరీక్షలు జరుగుత

పది పరీక్షల కోసం ఒంటిపూట బడుల్లో..
ఎండలు మండుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే పదో తరగతి పరీక్షల కారణంగా ఏపీలో ప్రభుత్వం ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేసింది. పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో ఒంటిపూట బడుల ప్రారంభ సమయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 1.15 గంటలకే స్కూల్స్ ప్రారంభమయ్యేవి. మిగిలిన స్కూళ్లకు ఉదయం 7:45 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మాత్రం మార్పులు ఉంటాయి. వాటిలో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Half Day School
Timings
తెలుగు రాష్ట్రాల్లో
ప్రభుత్వం
Scroll for the next article