News14th Oct 03:45 PMSunil Byrisetty1 min read
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై కసరత్తు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 10 మంది మంత్రులతో కేబినెట్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో సభ్యుడిగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, డీఎస్‌బీవీస్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనం చేయాలని సబ్‌కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటర్‌మీడియేటరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని, ఒక వేళ పోస్టులను సృష్టించాలనుకుంటే.. పే స్కేల్ నిర్ణయించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.