News1st Apr 02:56 PMSunil Byrisetty1 min read

'అగ్రిగోల్డ్' ఆస్తుల వేలానికి సిద్ధం

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఒక కొలిక్కి వస్తోంది. అగ్రిగోల్డ్ కుంభకోణంలో లక్షలాది మంది బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్

'అగ్రిగోల్డ్' ఆస్తుల వేలానికి సిద్ధం
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఒక కొలిక్కి వస్తోంది. అగ్రిగోల్డ్ కుంభకోణంలో లక్షలాది మంది బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుంది. 10 లక్షల మంది బాధితులకు ఆ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్‌కు 21,642 ఎకరాల భూములు, లక్ష చ.గజాల స్థలాలున్నాయి. వీటివిలువ 2012లో రూ. 3,869కోట్లు కాగా ఇప్పుడు మరింత పెరిగింది. ఈ ఆస్తులన్నీ సీఐడీ ఆధీనంలోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనే కాక కర్ణాటక పొరుగు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ భూములున్నాయి. కోర్టు అనుమతితో వీటిని వేలం వేసి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Agri Gold
Government
జాతీయ
అంతర్జాతీయ
Scroll for the next article