News28th Mar 11:20 AMSunil Byrisetty1 min read
ఓలా, ఉబర్ కాదు.. ఇక నుంచి సహకార్
డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త యాప్ తీసుకొస్తోంది. ఇక డ్రైవర్లకు పండగే అన్నట్లు వార్త చెప్పింది. నేరుగా డ్రైవర్ల అకౌంట్ లోకే డబ్బులు పడేలా రూపకల్పన చేసింది. దేశ వ్యాప్తంగా డ్రైవర్లకు
డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త యాప్ తీసుకొస్తోంది. ఇక డ్రైవర్లకు పండగే అన్నట్లు వార్త చెప్పింది.
నేరుగా డ్రైవర్ల అకౌంట్ లోకే డబ్బులు పడేలా రూపకల్పన చేసింది.
దేశ వ్యాప్తంగా డ్రైవర్లకు లాభం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీ యాప్‌ని తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ సహకార్ టాక్సీ యాప్ కూడా ఓలా, ఉబర్, రాపిడ్ మాదిరి రైడ్ సర్వీస్లను అందిస్తుందని తెలిపారు.
టూ వీలర్స్, టాక్సీలు, ఆటోలు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, వారికి డబ్బులు నేరుగా వారి వారి అకౌంట్లలోకి పడతాయని అమిత్ షా తెలిపారు.
ప్రస్తుతం ఉన్న యాప్‌లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ డ్రైవర్ల నుంచి కొంత కమీషన్ తీసుకుంటాయి.
సహకార్ యాప్‌తో అలాంటివి ఉండకపోవచ్చని చెబుతున్నారు.
అలాగే డ్రైవర్ల వివరాలు ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకూ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.