Politics27th Sep 03:14 PMSunil Byrisetty1 min read

వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగ సంతకాలపైనే శ్రద్ధ

వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ అని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావ

వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగ సంతకాలపైనే శ్రద్ధ
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ అని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదన్నారు. జీతాల కోసం మాత్రం దొంగచాటుగా సంతకాలు పెట్టిపోతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఇక దొంగచాటుగా సంతకాలు పెట్టి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత సాఫ్ట్ వేర్ ద్వారా ఎంతసేపు సభలో ఉన్నారో తెలిసిపోతుందని చెప్పారు. సభకు రాకుండా దొంగ సంతకాలు చేసినవారి జాబితా మా వద్ద ఉందని మాధవి స్పష్టం చేశారు.
Andhra Pradesh
YCP
Politics
Kadapa
Madhavi Reddy
Assembly
Fake Signatures
AI Tracking
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
రాజకీయాలు
ఏఐ సాఫ్ట్‌వేర్
సభా సమావేశాలు
Scroll for the next article