News19th Apr 01:27 PMSunil Byrisetty1 min read

బెట్టింగ్ యాప్‌లపై మంత్రి లోకేష్ సీరియస్

బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుప

బెట్టింగ్ యాప్‌లపై మంత్రి లోకేష్ సీరియస్
బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. బెట్టింగ్ యాప్‌ల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. "బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నారని నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన, ఇంకా.. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడం. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామ"ని సదరు పోస్టులో లోకేష్ చెప్పారు.
Andhra Pradesh
Nara Lokesh
Betting Apps
బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం
Scroll for the next article