Jobs23rd Jan 11:53 AMSunil Byrisetty1 min read

గ్రేడ్-3 ఈవోలుగా.. సచివాలయ ఉద్యోగులు!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయశాఖలోని ఖాళీగా ఉన్న గ్రేడ్-3 ఈవో పోస్టులకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ ఉద్యోగులను తీసుకునేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. స్వర్

గ్రేడ్-3 ఈవోలుగా.. సచివాలయ ఉద్యోగులు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయశాఖలోని ఖాళీగా ఉన్న గ్రేడ్-3 ఈవో పోస్టులకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ ఉద్యోగులను తీసుకునేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగులను దేవాదాయశాఖలో విలీనం చేసుకుని, గ్రేడ్-3 ఈవో లుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలు పరిశీ లించాలంటూ ఆ శాఖ కార్యదర్శి తాజాగా మెమో జారీ చేశారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలంటూ దేవాదాయ కమిషనర్లను ఆదేశించారు. మరోవైపు కమిషనర్ కార్యాలయంలో 20 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటికి కూడా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖకు చెందిన ఉద్యో గులను తీసుకుంటే.. ఫైళ్లు వేగంగా పరిష్కారం అయ్యేం దుకు అవకాశం ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోంది.
Andhra Pradesh Government
Grade-3 EVO
Devasthanam Department
Swarna Gram
Swarna Ward
Secretariat Employees
పోస్టింగ్‌లు
ప్రభుత్వ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ పాలన
ఉద్యోగ బదిలీలు
Scroll for the next article