News18th Mar 01:10 PMSunil Byrisetty1 min read
గ్రామ, వార్డు వాలంటీర్స్ వ్యవస్థను పునరుద్ధరించాలి
గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని, వాలంటీర్స్ వ్యవస్థపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వ
గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని, వాలంటీర్స్ వ్యవస్థపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి వెంకట్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందన్నారు. ఐదు వేలు ఇస్తున్న గౌరవ వేతనాన్ని పది వేలు చెల్లిస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు గడుస్తున్న వాలంటీర్ల వ్యవస్థను పట్ల సరైన నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తారని ఆశతో ఎదురు చేసిన వాలంటీర్లను నిరాశ పరుస్తూ గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని ఉత్తర్వులు ఇవ్వలేదని, వాలంటీర్స్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల్లో లేరని విధుల్లో ఉండి ఉంటే మా ప్రభుత్వం ఆలోచన చేసేదని చెప్పడం సరైనది కాదన్నారు.
ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది విద్యావంతులైన యువత వాలంటీర్లుగా తమ సేవలను గుర్తించాలన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం టిడిపి కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థ పునరుద్ధరణ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో గ్రామ, వార్డు వాలంటీర్ అందర్నీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.