Telangana20th Jul 03:54 PMSunil Byrisetty1 min read

అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు

హైదరాబాద్లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు వేలాదిగా విచ్చేస్తున్నారు. బోనాలతో వచ్చే భక్తుల సౌకర్య

అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు
హైదరాబాద్లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు వేలాదిగా విచ్చేస్తున్నారు. బోనాలతో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు హోరెత్తుతున్నాయి. అమ్మవారి బోనాల కోసం పోలీసులు సుమారు 2500 మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ చూసినా భక్తుల బోనాల సందడే కనిపిస్తోంది.
Telangana news
Bonalu Festival
Lal Darwaza Bonalu
Hyderabad Bonalu
Simhavahini Mahankali
Devotees at Bonalu
Temple Celebrations
Bonalu Security Arrangements
అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు
Scroll for the next article