Spiritual3rd Sep 11:29 AMSunil Byrisetty1 min read
వైభవంగా ఆదిత్యుని కళ్యాణం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైయున్న ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉష, పద్మిని, ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భాద్రపద శుద్ధ
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైయున్న ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉష, పద్మిని, ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు భాద్రపద శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ తెలిపారు.