News18th Oct 01:03 PMSunil Byrisetty1 min read

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతి

తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతి
తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరీ చిత్రపటానికి పూలమాలలు వేసి, సంప్రదాయ సిద్దంగా భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు భగవాన్ ధన్వంతరీ సమాజానికి అందించిన ఔషద సేవలను స్మరించుకున్నారు. వైద్యనారాయణుడు ధన్వంతరీ భగవన్ జయంతిని వైయస్ఆర్‌సీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోందని అప్పిరెడ్డి అన్నారు. మానవుల ఆనారోగ్యాన్ని తొలగించి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆధ్యుడు భగవాన్ ధన్వంతరీ అని కొనియాడారు. ఆయన అందించిన జ్క్షానాన్ని నాయీబ్రాహ్మణులు అందుకుని, ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్యులు లేని సమయంలో నాయీబ్రాహ్మణులే తమ వైద్య విజ్క్షానంతో చికిత్సలు చేసేవారని పేర్కొన్నారు.
Andhra Pradesh
YSRCP
Dhanvantari Jayanti
Ayurveda
Tadepalli
Leela Appireddy
Health
Traditional Medicine
Celebration
Devotion
నాయీబ్రాహ్మణులు
పార్టీ కార్యక్రమం
ఆధ్యాత్మిక వేడుక
వైద్య నారాయణుడు
Scroll for the next article