News27th Jan 03:56 PMSunil Byrisetty1 min read
ఘనంగా ఎలక్ట్రీషియన్ దినోత్సవం
మంగళగిరి ఇందిరానగర్ సెంటర్లో మంగళగిరి- తాడేపల్లి - దుగ్గిరాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ ఎలక్ట్రీషియన్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట
మంగళగిరి ఇందిరానగర్ సెంటర్లో మంగళగిరి- తాడేపల్లి - దుగ్గిరాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ ఎలక్ట్రీషియన్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జీ ప్రభాకరరావు హాజరయ్యారు. యూనియన్ కార్యాలయం ఆవరణలోని యూనియన్ జెండాను ప్రభాకరరావు ఆవిష్కరించారు. యూనియన్ వలన సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చన్నారు. భవన నిర్మాణంలో పనిచేసే ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికుడే అన్నారు. కార్మికుడు లేబర్ ఆఫీసులో నమోదు చేయించుకోవడం వల్ల ప్రభుత్వం అందించే పథకాలను పొందటానికి అవకాశం ఉంటుందన్నారు. కార్మికులకు ప్రమాదం జరిగి మరణిస్తే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు, సహజ మరణంకు లక్ష ఇరవై వేల రూపాయలు, ప్రసూతి మహిళలకు రెండు కాన్పులకు 40 వేల రూపాయలు, వివాహ, దివ్యాంగులకు వంటి పథకాలు ఉన్నాయన్నారు. యూనియన్ ఒక కుటుంబ సభ్యులుగా ఉండి, యూనియన్ పటిష్టంగా ఉండేవిధంగా చూసుకొని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.