News22nd Jan 04:49 PMSunil Byrisetty1 min read
ఘనంగా గిడుగు రామ్మూర్తి వర్ధంతి
తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ పితామహులు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి 86వ వర్ధంతిని నేడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ల
తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ పితామహులు స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి 86వ వర్ధంతిని నేడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. త్రివిక్రమరావు (విక్రమ్ పూల), ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ (శరత్ చంద్ర)తదితరులు పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్ర పటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికార భాషా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు కీర్తి శేషులు గిడుగు రామ్మూర్తి అని పేర్కొన్నారు. ఆయన కృషి కారణం గానే.. ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు, తెలుగు వ్యావహారిక భాషలోకి వచ్చాక అందరికీ చేరువ కాగలిగిందని అన్నారు. ఆర్. డి. విల్సన్ మాట్లాడుతూ.. గిడుగు సేవలు మర్చిపోలేనివి అని, ఆయన సాహితీ సేవలు అజరామరం అని కొనియాడారు.