Spiritual25th Oct 04:16 PMSunil Byrisetty1 min read
లాగోస్‌లో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
నైజీరియాలోని లాగోస్‌లో తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అక్కడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రవాసాంధ్రులు అత్యంత వైభవంగా ని
నైజీరియాలోని లాగోస్‌లో తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అక్కడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రవాసాంధ్రులు అత్యంత వైభవంగా నిర్వహించారు. నైజీరియాలోని శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్ ట్రస్ట్, హిందూ మందిర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. లాగోస్‌లోని తెలుగు సమాజం ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ మురళీ మోహన్ కృష్ణమాచార్యుల మార్గదర్శకత్వంలో పూజా కార్యక్రమాలు, వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా జరిగాయి.
నవరాత్రుల్లో ప్రతిరోజూ లలితా పారాయణం చేశారు. గ్రామోత్సవం, ఊంజల్ సేవలు నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలు, హనుమాన్ చాలీసా పఠనం కూడా జరిగాయి. మహామంగళ హారతి ఇచ్చి, మహాప్రసాదాన్ని భక్తులకు పంచారు. 16వ తేదీన సరస్వతీ పూజ, 17న స్వామివారికి విశేష అభిషేకం, ఆరతి జరిపారు. 18న లక్ష్మీ కుంకుమార్చన, 19న ఒడి బియ్యం పూజ, లలితా పారాయణం జరిగాయి. 20న ముగింపు ఊంజల్ సేవలతో ఉత్సవాలు పూర్తయ్యాయి.
ఈ వేడుకల నిర్వహణలో టెంపుల్ కమిటీ చైర్మన్ పి. ఎస్. బాలు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ పిల్లా, పలువురు భక్తులు సహకరించారు.