Spiritual15th Sep 01:20 PMSunil Byrisetty1 min read
సింహాచలంలో ఘనంగా గోమాత పూజ
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం కృష్ణాపురం గోసాలలో శ్రీకృష్ణ జయంతి వేడుకలులో భాగంగా భక్తిశ్రద్ధల మధ్య సోమవారం ఘనంగా గోపూజ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికా
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం కృష్ణాపురం గోసాలలో శ్రీకృష్ణ జయంతి వేడుకలులో భాగంగా భక్తిశ్రద్ధల మధ్య సోమవారం ఘనంగా గోపూజ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు ఆదేశాల మేరకు, పర్యవేక్షణాధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్ ఆధ్వర్యంలో గోసాల ఆవరణ అంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడింది. ముందుగా అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, అలంకరణలు, మంగళహారతులు నిర్వహించారు. భక్తులు "గోవిందా, గోపాలా" నినాదాలతో గోసాల ప్రాంగణాన్ని మార్మోగించారు.
గోమాత ను , స్నానం చేయించి పుష్పమాలతో అలంకరించిభక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చారు. గోవు చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ శాంతి, సమృద్ధి కోరుకున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, గోమాత పూజలో పాల్గొనడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, ధార్మికంగా గోసేవ ప్రాముఖ్యత అపారమని భక్తులకు వివరించారు.