Spiritual28th Jul 03:05 PMSunil Byrisetty1 min read
దసరాలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే శీనానాయక్ తెలిపారు. ఈ సంద
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీకే శీనానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈవో మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.