TTD26th Oct 01:13 PMSunil Byrisetty1 min read

తిరుమలలో జలాశయాలకు ఘనంగా గంగా హారతి

తిరుమలలో జలాశయాలకు ఘనంగా గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. పాపవినాశనం వద్ద గంగమ్మకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు-కుంకుమ, పూలు గంగమ్మకు నివేదించి టీటీడ

తిరుమలలో జలాశయాలకు ఘనంగా గంగా హారతి
తిరుమలలో జలాశయాలకు ఘనంగా గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. పాపవినాశనం వద్ద గంగమ్మకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు-కుంకుమ, పూలు గంగమ్మకు నివేదించి టీటీడీ ఛైర్మన్ పూజలు నిర్వహించారు. టీటీడీ చరిత్రలో తొలిసారి భారీ విరాళాలు వచ్చాయని, 11 నెలల్లో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్ల విరాళాలు రావడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. తిరుమలలో నాలుగు జలాశయాలు పూర్తిగా నిండాయని, మరో రెండు జలాశయాలు కొంత మేర నిండాలని వివరించారు. తిరుమలకు వచ్చే భక్తులకు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని.. కల్యాణి జలాశయం నుంచి 25 లక్షల గ్యాలన్ల నీరు వస్తోందని తెలిపారు. జలాశయాలు నిండు కుండల్లా మారడం శుభపరిణామమన్నారు. తిరుమలలో డ్యామ్‍లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‍ శాఖకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందనలు తెలిపారు.
Andhra Pradesh
Tirumala
TTD
Ganga Harathi
BR Naidu
Papavinasanam
Tirumala Reservoirs
Water Management
Devotees
Kalyani Reservoir
TTD Donations
Temple Administration
టీటీడీ ట్రస్టులు
ఇంజినీరింగ్ శాఖ
ఆధ్యాత్మిక కార్యక్రమం
Scroll for the next article