Spiritual7th Oct 10:17 AMSunil Byrisetty1 min read
అత్యంత శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ మంగళవారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ మంగళవారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టారు. కాబోయే నూతన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్జేసీ భ్రమరాంబ విశేష అతిథులుగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవో శీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ , ముఖ్య అతిథులు శ్రీనివాస్ శాస్త్రితో కలసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరిప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.