TTD16th Jan 05:36 PMSunil Byrisetty1 min read

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్ర‌వారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జి.భాన

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్ర‌వారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజ చేశారు. అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. గోశాల ఇంచార్జి సంచాలకులు డాక్టర్ శివ కుమార్, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tirupati
Sri Venkateswara Gosamrakshana Trust
Kanuma Festival
Go Puja
TTD
EO Anil Kumar Singhal
Bhanu Prakash Reddy
గో మహోత్సవం
శ్రీవేణుగోపాల స్వామి ఆలయం
భక్తులు
Scroll for the next article