Spiritual31st Jan 02:29 PMSunil Byrisetty1 min read

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరిగాయి. స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
Andhra Pradesh
Srisailam
Golden Chariot Festival
Arudra Nakshatram
Sri Swami Ammavaru
Ekadasha Rudrabhishekam
Anna Abhishekam
కోలాటం
జానపద కళారూపాలు
భారతీయ ఆచారాలు
Scroll for the next article