TTD19th Oct 04:57 PMSunil Byrisetty1 min read

స్వర్ణ రథంపై శ్రీవారు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తిరుమలలో స్వర్ణరథోత్సవం భక్తులను భక్తిపారవశ్యంల

స్వర్ణ రథంపై శ్రీవారు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తిరుమలలో స్వర్ణరథోత్సవం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. స్వర్ణరథోత్సవం మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ వైభవంగా సాగింది. స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్ణరథాన్ని లాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Scroll for the next article