News22nd May 11:31 AMSunil Byrisetty1 min read

గుడివాడలో అంగరంగ వైభవంగా హనుమజ్జయంతి

గుడివాడ పట్టణంలోని దేవాలయాల్లో హనుమజ్జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం, నాగవరప్పాడు లో

గుడివాడలో అంగరంగ వైభవంగా హనుమజ్జయంతి
గుడివాడ పట్టణంలోని దేవాలయాల్లో హనుమజ్జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం, నాగవరప్పాడు లోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం, గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం, పెద ఎరుకుపాడులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తదితర ఆలయాల్లో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలియజేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
Andhra Pradesh
Gudivada
Hanuman Jayanti celebrations
బంటుమిల్లి రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం
గుడివాడ హనుమజ్జయంతి వేడుకలు
Scroll for the next article