News13th Aug 03:25 PMSunil Byrisetty1 min read

దేశభక్తి స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని చాటుతూ విజయవాడలో ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల

దేశభక్తి స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని చాటుతూ విజయవాడలో ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు త్రివర్ణ పతాకాలతో శోభాయమానంగా మారాయి. బందరు రోడ్డుపై ర్యాలీ సాగుతున్న సమయంలో “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” నినాదాలు మార్మోగాయి. కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగి ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేరుకుంది. చేతుల్లో జాతీయ జెండాలు, హృదయాల్లో దేశభక్తి నింపుకుని విద్యార్థులు, యువత, క్రీడాకారులు, అధికారులు, పోలీసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా వినిపించిన దేశభక్తి నినాదాలు యువతలోనూ, విద్యార్థుల్లోనూ జాతీయ స్ఫూర్తిని నింపాయి.
Independence day
Har Ghar Tiranga
Tiranga Rally
Vijayawada
Independence Day
Patriotism
National Unity
Indian Flag
Tricolour
భారత్ మాతా కీ జై
విద్యార్థులు
యువత
ఆంధ్రప్రదేశ్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ స్ఫూర్తి
Scroll for the next article