Spiritual29th Jan 03:49 PMSunil Byrisetty1 min read
వైభవంగా నృసింహుని గ్రామోత్సవం
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ స్వామి వారు బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు శ
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ స్వామి వారు బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు శ్రీదేవి, భూదేవి సమేతుడైన నరసింహస్వామి వార్ల ఉత్సవమూర్తులను వాహనంపై అధిష్టింపజేసి రంగు రంగు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి గ్రామోత్సవం తొలుత దేవస్థానం మాడవీధులలో నిర్వహించి, అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్ వరకు చేరుకొని తిరిగి పెద కోనేరు మీదుగా దేవస్థానం చేరుకుంది. గ్రామోత్సవంలో ఆయా సెంటర్లలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాన్ని దేవస్థానం సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు.