News7th Jan 04:03 PMSunil Byrisetty1 min read

77వ గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి

రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈనెల 26వ తేదీన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజ

77వ గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈనెల 26వ తేదీన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకల ప్రాంగణంలో తగిన తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగు దొడ్లు, బారీ కేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో లోక్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం, సియం క్యాంపు కార్యాలయం సహా ఇతర ముఖ్య భవనాలను విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు.
Andhra Pradesh
77th Republic Day
Republic Day Celebrations
Capital Region
Government Preparations
CS K. Vijayanand
జనవరి 26
భద్రతా ఏర్పాట్లు
ట్రాఫిక్ నియంత్రణ
ప్రజా భద్రత
Scroll for the next article