Spiritual5th Sep 03:54 PMSunil Byrisetty1 min read

దేవుని కడపలో వైభవంగా పవిత్ర ప్రతిష్ట

కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం ప్రత్యేక వైదిక కార్యక్రమాల మధ్య పవిత్ర ప్రతిష్ట నిర్వహ

దేవుని కడపలో వైభవంగా పవిత్ర ప్రతిష్ట
కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం ప్రత్యేక వైదిక కార్యక్రమాల మధ్య పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, చతుస్రనామార్చన, ద్వార తోరణ, అనంత కళా పూజ, అగ్ని ప్రతిష్ట నిర్వహించగా, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు నిత్యహోమం వంటి పూజలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 6న పవిత్ర సమర్పణ, స్నపన తిరుమంజనం జరుగనుంది. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షించనుంది.
Andhra Pradesh
Kadapa
Sri Lakshmi Venkateswara Swamy Temple
Temple Festival
Sacred Consecration
Vedic Rituals
Hindu Temple
Religious Event
Temple Ceremony
Sri Eshwar Reddy
పవిత్ర ప్రతిష్ట
వైదిక కార్యక్రమాలు
Scroll for the next article