TTD29th Oct 04:48 PMSunil Byrisetty1 min read

వైభవంగా శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాలభైరవస్వామివారి హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వైభవంగా శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాలభైరవస్వామివారి హోమం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 07 వరకు చండీహోమం నిర్వహించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 07 వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 9 రోజుల పాటు జరుగనున్న శ్రీ కామాక్షి అమ్మవారి శ్రీ చండీ హోమానికి బుధవారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Andhra Pradesh
TTD
Tirupati
Sri Kapileswaralayam
Kalabhairava Homam
Chandi Homam
Homa Mahotsavam
Hindu Rituals
శ్రీ కపిలేశ్వరాలయం
శ్రీ కాలభైరవహోమం
Scroll for the next article