News27th Jul 12:23 PMSunil Byrisetty1 min read
సింగపూర్‌లో బాబు కార్యక్రమానికి అనూహ్య స్పందన!
సింగపూర్‌లో తెలుగు డయోస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సీఎం రాకకు రెండు గంటల ముందే సమావేశ ప్రాంగణం నిండిపోయింది. మొత్తం 1500 సీటింగ్‌తో కూడిన ఒన
సింగపూర్‌లో తెలుగు డయోస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సీఎం రాకకు రెండు గంటల ముందే సమావేశ ప్రాంగణం
నిండిపోయింది. మొత్తం 1500 సీటింగ్‌తో కూడిన ఒన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సింగపూర్‌తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి తెలుగు ప్రజలు
తరలివచ్చారు. సింగపూర్ సహా వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి అనుబంధంగా మరో ప్రాంగణంలో సీటింగ్ ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో తెలుగు డయోస్పోరా వేదిక ఓవిస్ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. డయాస్పోరాలో తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు.