News12th Oct 02:07 PMSunil Byrisetty1 min read

విజయవాడలో గ్రేట్ అమ‌రావ‌తి షాపింగ్ ఫెస్టివ‌ల్‌..

సూప‌ర్ జీఎస్‌టీ - సూప‌ర్ సేవింగ్స్‌తో ఇటు వినియోగ‌దారుల‌కు అటు వ్యాపారుల‌కు సూప‌ర్ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని.. ప్ర‌తి కుటుంబానికీ, ప్ర‌తి వ్యాపారానికీ ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. జీఎస

విజయవాడలో గ్రేట్ అమ‌రావ‌తి షాపింగ్ ఫెస్టివ‌ల్‌..
సూప‌ర్ జీఎస్‌టీ - సూప‌ర్ సేవింగ్స్‌తో ఇటు వినియోగ‌దారుల‌కు అటు వ్యాపారుల‌కు సూప‌ర్ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని.. ప్ర‌తి కుటుంబానికీ, ప్ర‌తి వ్యాపారానికీ ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. జీఎస్‌టీ 2.0 సంస్క‌ర‌ణ‌లతో ప్ర‌జ‌ల‌కు జరుగుతున్న ప్ర‌యోజ‌నాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే క్ర‌మంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వ‌ర‌కు గ్రేట్ అమ‌రావ‌తి షాపింగ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. సూపర్ జీఎస్టీ - సూప‌ర్ సేవింగ్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వాణిజ్య ప‌న్నుల శాఖ‌, జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని పున్న‌మిఘాట్ - బెరం పార్కులో జ‌రిగే గ్రేట్ అమ‌రావ‌తి షాపింగ్ ఫెస్టివ‌ల్‌పై మాట్లాడారు. వాణిజ్యం, వినోదానికి వేదిక‌గా నిలిచే షాపింగ్ ఫెస్టివ‌ల్‌లో వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు, హ‌స్త‌క‌ళాకారులు.. ఇలా వివిధ వ‌ర్గాల‌వారు త‌మ స్టాళ్ల‌ను ఏర్పాటుచేసుకొని బ్రాండ్ ప్ర‌మోటింగ్ చేసుకోవ‌చ్చ‌న్నారు. వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు జీఎస్‌టీ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌డంతో పాటు దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఆఫ‌ర్లు, రాయితీలు ప్ర‌క‌టిస్తాయ‌న్నారు. మెగా ల‌క్కీ డ్రాల‌తో పాటు ఉత్త‌మ స్టాళ్ల‌కు అవార్డులు కూడా అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దాదాపు 100 స్టాళ్ల‌తో ఏర్పాటుచేసే ఈ ఫెస్ట్‌లో జీఎస్‌టీ సంస్క‌ర‌ణ‌ల ఫ‌లాల‌పై మేధోమ‌థ‌న చ‌ర్చ‌లు, స‌మావేశాలను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములై ఈ ఫెస్ట్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని, స్థానిక వ్యాపారులు, ప్ర‌జ‌లు ఫెస్ట్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.
Andhra Pradesh
Amaravati Shopping Festival
Vijayawada Events
Super GST
Super Savings
Shopping Festival
Diwali Offers
Business Growth
GST Awareness
Scroll for the next article