News9th Jan 09:10 AMSunil Byrisetty1 min read

గ్రేట్ గ్రీన్ వాల్ ప్రతిష్టాత్మకం

తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాత

గ్రేట్ గ్రీన్ వాల్ ప్రతిష్టాత్మకం
తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని సూచించారు. దీనికోసం అటవీ శాఖ సిబ్బంది సమష్టిగా పని చేస్తూ ముందుకు కదలాలని పవన్ పిలుపునిచ్చారు. 1052 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత రక్షణకు మడ అడవులు బలమైన గోడల్లాంటివని, వీటిని పెంపొందించడంలో, రక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో "మడ అడవుల పెంపుదల - వాటి నుంచి సుస్థిర ఆదాయం (MISHTI)" జాతీయ స్థాయి వర్క్ షాపు విజయవాడలో ప్రారంభం అయ్యింది. రాష్ట్రానికి తుపానుల ప్రభావం చాలా అధికమని, దీనివల్ల ప్రతి ఏటా అపార నష్టం జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో తుపానుల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మడ అడవులను సమృద్ధిగా పెంచడం అనేది కీలకమన్నారు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలో సుమారుగా 700 హెక్టార్లలో మడ అడవులను పెంచిందని పేర్కొన్నారు.
Andhra Pradesh
Mangroves
Great Green Wall
Coastal Protection
Pawan Kalyan
Climate Resilience
Disaster Management
పర్యావరణ పరిరక్షణ
మిష్టీ పథకం
అటవీ శాఖ
సుస్థిర అభివృద్ధి
Scroll for the next article