Politics3rd Mar 04:00 PMSunil Byrisetty1 min read

గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప

గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్...పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలిఅడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం యొక్క నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ‘గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌కు సహకారం అందిస్తాయి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
CM Chandra babu
AP News
politics
Scroll for the next article