News21st Oct 04:16 PMSunil Byrisetty1 min read

అమృత్ 2.0 పథకం పనులకు గ్రీన్‍సిగ్నల్

ఏపీ పట్టణాభివృద్ధి చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి ప్రాజెక్టుగా అమృత్ 2.0 రికార్డ్ సాధించింది. పట్టణాల్లో మెరుగైన తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించేందుకు వీలు ఏర్పడింది. రూ.10,319,9

అమృత్ 2.0 పథకం పనులకు గ్రీన్‍సిగ్నల్
ఏపీ పట్టణాభివృద్ధి చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి ప్రాజెక్టుగా అమృత్ 2.0 రికార్డ్ సాధించింది. పట్టణాల్లో మెరుగైన తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించేందుకు వీలు ఏర్పడింది. రూ.10,319,93 కోట్లతో 281 పనులకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మున్సిపల్‍శాఖ ఆమోదం లభించనుంది. APUFIDC, పబ్లిక్ హెల్త్, గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్‍లకు బాధ్యతలు అందించనుంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం నుంచి రూ.4,470 కోట్లు, రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.2,490 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.925 కోట్లు, పట్టణాల వాట రూ.590 కోట్లు కేటాయించింది. మొత్తం ప్రాజెక్టు క్యాపెక్స్ రూ.6,477 కోట్లు, పదేళ్ల నిర్వహణ ఖర్చు రూ.1,499 కోట్లు, వడ్డీ ఖర్చు రూ.2,344 కోట్లు విడుదల చేయనుంది.
Andhra Pradesh
Urban Development
AMRUT 2.0
Drinking Water
Drainage Projects
Municipal Administration
APUFIDC
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్
మౌలిక సదుపాయాలు
కేంద్ర ప్రభుత్వం
Scroll for the next article