News28th Nov 05:13 PMSunil Byrisetty1 min read
నియోజకవర్గ స్థాయిలోనూ అర్జీల స్వీకరణ
ప్రజలకు చేరువగా సుపరిపాలన లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక (పీజీఆర్ఎస్), ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని.. గౌర
ప్రజలకు చేరువగా సుపరిపాలన లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక (పీజీఆర్ఎస్), ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని.. గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. విజయవాడ రూరల్, నున్నలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించగా.. గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 414 అర్జీలు వచ్చాయి. వీటిని నిర్దేశ గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గాల స్థాయిలోనూ పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాలతో పాటు షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గ స్థాయిలోనూ నిర్వహిస్తున్నామని వివరించారు.