News31st Jul 10:59 AMSunil Byrisetty1 min read
జీఎస్ఎల్వీ- ఎఫ్16 విజయవంతం
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక.. 2,393 కిలోల బరువున్న 'నైసార్' ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక.. 2,393 కిలోల బరువున్న 'నైసార్' ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో-నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగానూ నిలిచింది. దీని కోసం నాసా 1.16 బిలియన్ డాలర్లను సమకూర్చగా.. భారత్ 90 మిలియన్ డాలర్లను ఇచ్చింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు చేర్చిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటిగా నిలిచింది. 'నాసా, ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్' (NISAR) భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) (ISRO and NASA)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్) అని పేరు పెట్టారు. రెండు సింథటిక్ అపర్చర్ రాడార్లు (సార్) అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే.