National4th Sep 09:24 AMSunil Byrisetty2 min read

దేశ ప్రజలకు పండుగ గిఫ్ట్!

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దీపావళి కానుకగా GST ట్యాక్స్ తగ్గించారు. ప్రతిరోజు వాడే వస్తువులపై జీఎస్టీ ఉపశమనం కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో హెయిర్ ఆయిల్, షాంపు, టూ

దేశ ప్రజలకు పండుగ గిఫ్ట్!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దీపావళి కానుకగా GST ట్యాక్స్ తగ్గించారు. ప్రతిరోజు వాడే వస్తువులపై జీఎస్టీ ఉపశమనం కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో హెయిర్ ఆయిల్, షాంపు, టూత్ పేస్ట్, సోప్స్, షేవింగ్ క్రీమ్ లపై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గనుంది. అలాగే బటర్, నెయ్యి, చీజ్, డెయిరీ స్ప్రెడ్స్, యుటెన్ సెల్స్, ఫీడింగ్ బాటిల్స్, ప్యాకింగ్ నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్, టైలరింగ్ మిషన్స్ & పార్ట్ మీద 12% నుంచి 5% తగ్గింది. ఇక హెల్త్ కేర్ ఐటమ్స్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% నుంచి ఏకంగా 0% అంటే పూర్తిగా ఎత్తివేశారు. ఇక ధర్మా మీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నాస్టిక్స్ ఐటమ్స్, గ్లూకో మీటర్ టెస్ట్ స్ట్రిప్స్, కరెక్టివ్ స్పెటికల్స్ పై12% నుంచి 5%కి తగ్గించారు. ఎడ్యుకేషన్ కి సంబంధించి మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, క్రేయాన్స్, షార్పనర్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, రబ్బరులపై ఉన్న పన్నును పూర్తిగా ఎత్తేశారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మర్స్ కి సంబంధించిన ట్రాక్టర్ టైర్స్, పార్ట్స్ పై18%, ట్రాక్టర్లపై, బయో ఫెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియెంట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్పింక్లర్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ మెషిన్స్ కల్టివేషన్ మెషిన్స్, హార్వెస్టింగ్ మెషిన్ పై ఉన్న 12% ను 5%కి తగ్గించారు. ఆటోమొబైల్స్ లో పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్ LPG CNG cars, 1200cc & 4000mm. మించి ఉండని, డీజిల్, డీజిల్ హైబ్రిడ్ LPG CNG cars, 1200cc & 4000mm. మించని, 3 వీలర్లు, మోటార్ సైకిల్స్ 350 cc లోపు, మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయిన ఎయిర్ కండిషనర్లు, టీవీ (above 32') Including LED, LCD, మానిటర్లు & ప్రొజెక్టర్, డిష్ వాషింగ్ మెషీన్లపై 28% ఉన్న జీఎస్టీని18%కి తగ్గిస్తూ మోదీ అద్భుత గిఫ్ట్ ప్రకటించారు. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ GST పేరుతో దేశ ప్రజల కు దీపావళి కానుకగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం పట్ల దేశ ప్రజలు అభినందనలు తెలపాలి.
India Economy
Narendra Modi
GST Reduction
Diwali Gift
Tax Relief
Essential Goods
Health Insurance
Education
Agriculture
Automobiles
Nirmala Sitharaman
Consumer Benefits
వినియోగదారుల సౌలభ్యం
పన్ను తగ్గింపు
Scroll for the next article