News13th Oct 04:16 PMSunil Byrisetty1 min read

జీఎస్‌టీ సంస్క‌ర‌ణ‌ల‌తో వాణిజ్య రంగానికి కొత్త ఊపు

సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ సేవింగ్స్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా కార్మిక శాఖ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం విజ‌య‌వాడలో గిగ్ వ‌ర్క‌ర్ల‌తో ఏర్పాటుచేసిన బైకు ర్యాలీని విజ‌య‌వాడ స

జీఎస్‌టీ సంస్క‌ర‌ణ‌ల‌తో వాణిజ్య రంగానికి కొత్త ఊపు
సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ సేవింగ్స్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా కార్మిక శాఖ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం విజ‌య‌వాడలో గిగ్ వ‌ర్క‌ర్ల‌తో ఏర్పాటుచేసిన బైకు ర్యాలీని విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ్యులు మాట్లాడుతూ జీఎస్‌టీ సంస్క‌ర‌ణ‌ల‌తో వ్యాపార వాణిజ్య రంగాల‌కు కొత్త ఊపు వ‌చ్చింద‌ని.. వినియోగ‌దారుల‌కు పెద్దఎత్తున ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0తో ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. అనంత‌రం గిగ్ వ‌ర్క‌ర్ల బైకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ సాంబ‌మూర్తి రోడ్డు నుంచి మాచ‌వ‌రం ఆంజనేయ‌స్వామి ఆల‌యం మీదుగా తిరిగి స‌భా ప్రాంగ‌ణానికి చేరింది. గిగ్ వ‌ర్గానికి సూప‌ర్ జీఎస్టీ ద్వారా క‌లుగుతున్న ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డ‌మే కాకుండా, కార్మిక వ‌ర్గానికి ప్ర‌భుత్వం అందిస్తున్న మ‌ద్ద‌తు వివ‌రాల‌ను కార్య‌క్ర‌మంలో తెలియ‌జేశారు. జీఎస్‌టీ త‌గ్గింపు వ‌ల్ల ఆన్‌లైన్ ఆర్డ‌ర్లు పెరుగుతున్నాయ‌ని తెలిపారు.
Andhra Pradesh
GST Reforms
Super GST
Vijayawada Event
Bonda Umamaheswara Rao
Gig Workers Rally
వాణిజ్యాభివృద్ధి
వినియోగదారుల ప్రయోజనాలు
Scroll for the next article