News21st Sep 11:55 AMSunil Byrisetty1 min read
జీఎస్టి సంస్కరణలతో ప్రజారోగ్య సంరక్షణకు భరోసా
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ నూతన సంస్కరణల వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలి
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ నూతన సంస్కరణల వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటివరకు ఉన్న 18 శాతం జియస్టీని తొలగిoచినందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అమలు చేయబోతున్న ఉచిత 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' వల్ల కూటమి ప్రభుత్వానికి ఏడాదికి సగటున రూ.750 కోట్లు వరకు ఆదా కాబోతుందన్నారు. అలాగే జీయస్టీ నూతన సంస్కరణల కారణంగా క్యాన్సర్, అరుదైన ఇతర వ్యాధుల (33 రకాల) మందులు, సర్జరీలకు సంబంధించిన పరికరాల ధరలు కూడా తగ్గినట్లు తెలిపారు. వ్యాక్సిన్లు, హెచ్ ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్జిక్ కిట్ల రేట్లు కూడా తగ్గాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నూతన జిఎస్టి సంస్కరణలను స్వాగతిస్తూ శాసనసభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన ప్రసంగాలు, ఏకగ్రీవ తీర్మానానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.