News17th Sep 11:59 AMSunil Byrisetty1 min read
నాలుగు స్లాబ్‌ల నుంచి రెండు స్లాబ్‌లకు తగ్గించాం
12 శాతంలో ఉండే వస్తువులు దాదాపు 99 శాతం 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 28 శాతం స్లాబ్‌లో ఉండే సిమెంట్‌ను 18 శాతం స్లాబ్ పరిధిల
12 శాతంలో ఉండే వస్తువులు దాదాపు 99 శాతం 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 28 శాతం స్లాబ్‌లో ఉండే సిమెంట్‌ను 18 శాతం స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. 28 శాతం స్లాబ్‌లో ఉండే దాదాపు 90 శాతం వస్తువులు 18 శాతానికి వచ్చేశాయని వివరించారు. 2017కి ముందు 17 రకాల పన్నులు ఉండేవి.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని తెలిపారు. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను, నాలుగు స్లాబ్‌లకు తీసుకొచ్చిందే జీఎస్టీ అని చెప్పారు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులు 1.51 కోట్లకు పెరిగారని జీఎస్టీ సంస్కరణలపై సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.