Politics11th Jul 01:10 PMSunil Byrisetty1 min read
విశాఖలో రూ.30 వేల కోట్ల భూ స్కాం.. గుడివాడ సంచలనం
విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్ల మేర భారీ భూ స్కాం జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. ప్రత
విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్ల మేర భారీ భూ స్కాం జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. ప్రతి కేబినెట్ సమావేశాన్ని ప్రజా సంక్షేమం కోసం కాకుండా భూకేటాయింపుల కోసమే నిర్వహిస్తున్నారని విమర్శించారు. తాజా కేబినెట్ సమావేశంలో 35 అజెండా అంశాల్లో 25కు పైగా భూకేటాయింపులకు సంబంధించినవేనని అన్నారు. విశాఖలోని విలువైన ప్రభుత్వ భూములను సీఎం చంద్రబాబు నాయుడు తన బినామీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 'ఉర్సా' అనే సంస్థకు 99 పైసలకే వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కేటాయించారని, మధురవాడలో రూ.2,000 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను కూడా బినామీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో విశాఖను దేశానికే దిక్సూచిగా తీర్చిదిద్దారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భూపందేరాలకు పాల్పడుతోందని విమర్శించారు.