Politics14th Jul 08:46 AMSunil Byrisetty1 min read
గుడివాడ ఘటనపై ఫిర్యాదు.. కేసు నమోదు
కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన గొడవ దాడులకు దారి తీసిన విషయం తెలిసిందే. జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్
కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన గొడవ దాడులకు దారి తీసిన విషయం తెలిసిందే. జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ దాడిపై ఉప్పాల హారికక ఫిర్యాదుపై కేసు నమోదైంది. కూటమి కార్యకర్తలు తనను అవమానించి, కారు అద్దాలు పగలగొట్టారని హారిక గుడివాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడ మండలం లింగవరంలో వైసీపీ సమావేశానికి వెళుతుండగా కూటమి కార్యక ర్తలు పట్టణంలోని నాగవరప్పాడులో తన కారు ఆపి దుర్భాషలాడారని ఫిర్యా దులో పేర్కొన్నారు. చంపుతామంటూ బెదిరించారని, తన కారును కదలనివ్వ కుండా అసభ్య పదజాలంలో దూషించారన్నారు. దీంతో పోలీసులు 126(2), 292, 324(4), 351(2) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.