Politics11th Mar 11:24 AMSunil Byrisetty1 min read
చకచకా గుడివాడ-కంకిపాడు రహదారి పనులు
కృష్ణా జిల్లాలో విజయవాడను అనుసంధానించే గుడివాడ- కంకిపాడు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గుంతలు, ఎత్తు పల్లాలతో రహదారి అత్యంత అధ్వానంగా ఉండేది. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే
కృష్ణా జిల్లాలో విజయవాడను అనుసంధానించే గుడివాడ- కంకిపాడు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
గుంతలు, ఎత్తు పల్లాలతో రహదారి అత్యంత అధ్వానంగా ఉండేది.
ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ద్విచక్రవాహన దారులే కాదు, కార్లు, బస్సులు, లారీ డ్రైవర్లు సైతం హడలిపోయేవారు.
అత్యంత అధ్వానంగా ఉండే ఈ రహదారిలో అనేక మలుపులు కూడా ఉండటంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
పెద్ద పెద్ద గుంతలతో దారుణంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణించిన ఏ వాహనమైనా షెడ్డుకెళ్లాల్సిందేనని చెప్పుకొంటుంటారు.
గోదావరి జిల్లాల్లోని భీమవరం, నర్సాపురం తదితర పట్టణాలను విజయవాడతో అనుసంధానించే ఈ కీలక రహదారికి ఇప్పుడు మోక్షం లభించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి.