News21st Sep 10:43 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యేకు టిడ్కో లోన్ల సెగ!
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును టిడ్కో కాలనీ వాసులు అడ్డుకున్నారు. టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేను టిడ్కో కాలనీ వాసులు చుట్టుముట్
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును టిడ్కో కాలనీ వాసులు అడ్డుకున్నారు. టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేను టిడ్కో కాలనీ వాసులు
చుట్టుముట్టారు. 2024 ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే టిడ్కో ఇళ్ల లోన్లన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన వాగ్దానం చేశారు. ఏడాదిన్నర అయ్యింది ఎప్పుడు లోన్లు మాఫీ చేస్తారంటూ టిడ్కో కాలనీ మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారని, బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రై చేస్తున్నాను.. టైమ్ పడుతుందని..ఇప్పటికిప్పడే చేయాలంటే చేయలేనని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో ఎమ్మెల్యే రాము వెనుతిరిగి వెళ్ళిపోయారు.