News22nd Jul 12:57 PMSunil Byrisetty1 min read

గుడివాడ టిడ్కో కాలనీ లబ్ధిదారుల ఆందోళన

గుడివాడ పట్టణంలోని టిడ్కో కాలనీ ఫ్లాట్ల లబ్ధిదారులు బుధవారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ టిడ్కో కాలనీ పోరాట స

గుడివాడ టిడ్కో కాలనీ లబ్ధిదారుల ఆందోళన
గుడివాడ పట్టణంలోని టిడ్కో కాలనీ ఫ్లాట్ల లబ్ధిదారులు బుధవారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ టిడ్కో కాలనీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముందుగా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు, నినాదాలతో ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ మహిళలు ఆందోళన చేసి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాము టిడ్కో ఫ్లాట్లకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి గత కొంత కాలంగా రుణం చెల్లించలేదని, ఇప్పుడు వడ్డీ పెరిగి అప్పు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Protest
Gudivada
TIDCO
Loan Waiver
ఆందోళన
వెనిగండ్ల రాము
ఆర్డీవో కార్యాలయం
ఆంధ్రప్రదేశ్
తెలుగు వార్తలు
Scroll for the next article