News19th Jan 12:48 PMSunil Byrisetty1 min read
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు మార్గదర్శకాలు
ఎస్సీ కార్పొరేషన్ అందించే ఆర్థిక రుణాలకు సంబంధించి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. 2025 - 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణ
ఎస్సీ కార్పొరేషన్ అందించే ఆర్థిక రుణాలకు సంబంధించి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. 2025 - 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి. ఇందులో మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్, ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలెక్ట్రిక్ ఆటో, పాసింజర్ కార్ (4 వీలర్), గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల ద్వారా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ రుణాల ద్వారా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం లక్ష్యంగా ఉంది.