News12th Jan 04:02 PMSunil Byrisetty1 min read
బెంగళూరు-విజయవాడ కారిడార్ పనుల్లో గిన్నిస్ రికార్డులు
జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులు అని, బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. సత్యసాయి జిల్లాలో
జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులు అని, బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి.
సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్‌కు సంబంధించి జాతీయ రహదారి పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదు కార్యక్రమానికి కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ ఆర్థిక కారిడార్ పరిధిలో జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక రంగం బలోపేతమవుతుంది. సత్వర రవాణా సేవలు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయి. జాతీయ రహదారుల అభివృద్ధితో పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా సులభతరమవుతుంది. ఇలా పారిశ్రామిక రంగం వృద్ధి చెందితే పెట్టుబడులు పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.