Telangana12th Aug 12:19 PMSunil Byrisetty1 min read

చందానగర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ షాప్‌ తెరిచిన 5 నిమిషాల్లోనే గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. దుకాణంలో దుండగులపై ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపార

చందానగర్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్‌ చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ షాప్‌ తెరిచిన 5 నిమిషాల్లోనే గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. దుకాణంలో దుండగులపై ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు.. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్‌ కాలికి గాయాలయ్యాయి. దొంగలు జహీరాబాద్‌ వైపు పారిపోవడంతో పోలీసులు జిల్లాల సరిహద్దులను అలర్ట్‌ చేశారు. సైబరాబాద్‌ సీపీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Chandanagar
firing incident
Khazana Jewellery robbery
armed robbery
CCTV destruction
Deputy Manager injured
Zaherabad escape route
Cyberabad Police
ఖజానా జ్యువెల్లరీ దోపిడీ
తుపాకీ దోపిడీ
Scroll for the next article