News4th Dec 04:15 PMSunil Byrisetty1 min read

విద్యా- వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ప్రధమ స్థానమే లక్ష్యం

విద్యా - వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలని ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మల అమలు ( స్వర్ణాంధ్ర - వికాసిత్ భారత్) ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్‌ అన

విద్యా- వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ప్రధమ స్థానమే లక్ష్యం
విద్యా - వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ  స్థానంలో నిలవాలని ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మల అమలు ( స్వర్ణాంధ్ర - వికాసిత్ భారత్) ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్‌ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఇరవై సూత్రాల కార్య‌క్ర‌మల అమలు ( స్వర్ణాంధ్ర - వికాసిత్ భారత్) ఛైర్మ‌న్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారీయా, నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవతో క‌లిసి వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, మౌళిక సదుపాయాల కల్పన శాఖలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప‌థ‌కాల స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయ‌డం ప్ర‌ధాన‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప్ర‌తి కార్య‌క్ర‌మం అమ‌లుకావాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. వైద్య ఆరోగ్యం, విద్యకు సంబంధించిన పథకాలు , అమృత్ 1.0, అమృత్ 2.0, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, పీఎం సూర్య‌ఘ‌ర్‌, పీఎం కుసుమ్‌ల‌పై ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.
Guntur District
Swarna Andhra
Viksit Bharat
Lanka Dinakar
Education Development
Healthcare Development
Twenty Point Programme
District Administration
Tamim Ansariya
Urban Development
Scroll for the next article