Agriculture1st Aug 12:03 PMSunil Byrisetty1 min read
మిర్చి.. మంటెత్తిస్తోంది!
గుంటూరు మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరల జోరందుకున్నాయి. క్వింటాకు రూ.3,000 వరకు పెరుగుదల నమోదవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు ఒక్కసారిగా
గుంటూరు మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరల జోరందుకున్నాయి. క్వింటాకు రూ.3,000 వరకు పెరుగుదల నమోదవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. గత 20 రోజుల్లో క్వింటాకు రూ.500 నుంచి రూ.3,000 వరకు ధరలు పెరిగాయి. విదేశాల నుంచి డిమాండ్ పెరగడం, నాణ్యమైన సరుకు కొరత, ఎల్‌నినో ప్రభావం వంటి కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. తేజ, 334, సూపర్-10 రకాల మిర్చికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు లేకపోతే సాగుపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.