News17th Sep 10:49 AMSunil Byrisetty1 min read

తురకపాలెంలో పర్యటించిన గుంటూరు కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తురకపాలెంలో పర్యటించారు. గ్రామంలో గల రెండు తాగు నీటి పథకాలు నుంచి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. గ్రామంలో పర్యటించి పారిశుధ్య పరిస్థ

తురకపాలెంలో పర్యటించిన గుంటూరు కలెక్టర్
గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తురకపాలెంలో పర్యటించారు. గ్రామంలో గల రెండు తాగు నీటి పథకాలు నుంచి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. గ్రామంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితి పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీసారు. జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. అనారోగ్య పరిస్థితులు తలెత్తితే తక్షణం వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. దగ్గరలో పెద్ద పలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని అచ్చట వైద్య సేవలు పొందవచ్చని సూచించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. వైద్య పరీక్షల వివరాలు తక్షణం గ్రామస్తులకు అందించాలని ఆమె ఆదేశించారు.
Andhra Pradesh
Guntur
Collector Visit
Turakapalem
Water Supply
Sanitation
Medical Camp
Health Services
Friday Dry Day
గ్రామీణాభివృద్ధి
ప్రజల సమస్యలు
తాగునీటి పథకం
Scroll for the next article